నిజాంబాద్ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..?

November 25, 2020 at 2:01 pm

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల వేడి తెలంగాణ రాజకీయాల్లో రాజుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీజేపీ అధికార టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది ఇక ఇటీవల నిజాంబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.

హైదరాబాదులోని కెబిఆర్ పార్కు వద్ద ఉన్న టిఆర్ఎస్ ప్లెక్సీలు ఇటీవలే నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చించి వేశాడు అని ఆరోపిస్తూ పలువురు టీఆర్ఎస్ నేతల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తోపాటు పలువురు బీజేపీ నేతలపై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్లో ఫ్లెక్సీలు చించేశాడు.

నిజాంబాద్ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts