బిగ్‌బాస్‌4: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్?

November 27, 2020 at 9:02 am

బుల్లితెర ఫుల్ పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ 12వ వారినికి చేరుకుంది. షో చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతున్న వేళ మిగిలిన ఎపిసోడ్స్‌ని మరింత రసవత్తంగా మార్చేందుకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప‌న్నెండో వారం వ‌చ్చే స‌రికి బిగ్ బాస్ ఇంట్లో ఏడుగురు మిగిలి ఉండ‌గా.. వీరిలో ఈ వారం అరియానా, మోనాల్‌, అఖిల్ మ‌రియు అవినాష్‌లు నామినేష‌న్‌లో ఉన్నారు.

ఈ నాలుగురులో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న ఉత్కంఠ ప్రేక్ష‌కుల్లో నెల‌కొంది. అయితే తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ వారం ఎలిమినేష‌న్ లేకుండా బిగ్ ట్విస్ట్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సీజన్‌ ముగింపుకు మరో నాలుగు వారాలే మిగిలి ఉన్నాయి. హౌస్‌లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

వీరిలో ఐదుగురు ఫైనల్‌కు వెళ్తారు. అంటే ఇద్దరు మాత్రమే ఎలిమినేట్‌ కావాలి. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చని లీకుల వీరులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో వచ్చే రెండు వారల్లో ఇద్దరిని ఎలిమినేట్‌ చేసి ఆ తరువాత డిసెంబర్‌ 20న గ్రాండ్ ఫినాలేను నిర్వహించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలుయాలంటే మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

బిగ్‌బాస్‌4: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts