హీరోయిన్ లేకుండానే చిరు సినిమా.. వర్కౌట్ అవుతుందా?

November 26, 2020 at 1:14 pm

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం.. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంతో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’ రీమేక్ కూడా చిరు చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి తమిళ డైరెక్ట‌ర్‌ మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా కోసం ఇప్పటికే మోహన్ రాజా మార్పులు మొదలుపెట్టారట. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర‌ను తీసేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్త‌వానికి లూసిఫర్ ఒరిజనల్‌లోనూ హీరోయిన్ పాత్ర ఉండదు.

కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్ర ఉంటుంద‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా రంగంలోకి దిగిన మోహన్ రాజా తెలుగులో కూడా హీరోయిన్‌ లేకుండానే సినిమాను తెరకెక్కించాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌.. అలాగే పాటలు కూడా పెద్దగా ఉండ‌వ‌ట‌. కేవ‌లం హీరో పాత్రలో చిన్న చిన్న మార్పులు మాత్ర‌మే చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి హీరోయిన్ లేకుండా చిరు సినిమా ఎంత వ‌ర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

హీరోయిన్ లేకుండానే చిరు సినిమా.. వర్కౌట్ అవుతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts