ఇండియన్ మార్కెట్లోకి నోకియా లాప్ టాప్ స్..!?

November 30, 2020 at 4:15 pm

ఒకప్పుడు ఫీచర్‌ ఫోన్ల విభాగంలో ప్రముఖ కంపెనీగా పేరు ఉన్న నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి.ఇదివరకు గతంలో మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ తట్టుకోలేక పక్కకు తప్పుకుంది. 2009లో నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్‌టాప్ నోకియా బుక్‌లెట్ 3జీ . ప్రస్తుతం తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను నోకియా రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దింతో మన దేశంలో తిరిగి మరలా ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం స్పష్టం అవుతుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నోకియా ల్యాప్‌టాప్‌లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలో మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు విండోస్ 10తో నడవనున్నాయి. నోకియా సంస్థ ఈ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేయడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కాబ్బటి మరిన్ని వివరాల కోసం ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇండియన్ మార్కెట్లోకి నోకియా లాప్ టాప్ స్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts