`ఆర్ఆర్ఆర్‌`కు ఎన్టీఆర్ గుడ్‌బై చెప్పేది అప్పుడే?

November 17, 2020 at 8:52 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజాగా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. విప్లవ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్ప‌టికే చెర్రీని అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్‌ను కొమ‌రం భీమ్‌గా ప‌రిచ‌యం చేస్తూ జ‌క్క‌న్న టీజ‌ర్లు కూడా విడుద‌ల చేశారు.

డీడీడీ ఎంటర్‌టైన్స్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ పూర్తై.. విడుద‌ల‌కు సిద్ధంగా ఉండాలి. కానీ, క‌రోనా కార‌ణంగా జ‌క్క‌న్న ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయాయి. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం షూటింగ్ రీ స్టాట్ అవ్వ‌గా.. రాత్రి పగలు తేడా లేకుండా శ‌ర‌వేగంగా చిత్ర టీమ్ ప‌ని చేస్తోంది.

అయితే అందుతున్న తాజా స‌మాచారం ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి ఫినిష్ కానుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ ఫిబ్ర‌వ‌రిలో ఆర్ఆర్ఆర్‌కు గుడ్ బై చెప్పేసి.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమాలో పాల్గొనున్నాడ‌ని తెలుస్తోంది. ఈలోపు త్రివిక్ర‌మ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోనుంది.

`ఆర్ఆర్ఆర్‌`కు ఎన్టీఆర్ గుడ్‌బై చెప్పేది అప్పుడే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts