సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న బిలాల్ పాట..!?

November 30, 2020 at 4:02 pm

‌బిలాల్ గోరెగెన్ అందరికి ‌ గుర్తుండే ఉంటారు. ‌బిలాల్ టర్కిష్‌కు చెందిన వీధి సంగీత కారుడు, వైబింగ్‌ క్యాట్‌ మీమ్‌ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. 1981లో జ్యోతి చిత్రం కి చెందిన హిట్‌ సాంగ్‌ కలియోన్‌ కా చమన్‌ సాంగ్ పాడటంతో ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు బిలాల్. దృష్టిలోపం ఉన్న సంగీత కారుడు ఆయన. గత సంవత్సరం తను పాడిన ఒక పాట చాలా పాపులర్ అయ్యింది. 1930లో ప్రసిద్ధి చెందిన ఇవాన్‌ పోల్కా అనే పాటను బిలాల్‌ ఒక పార్కులోని బెంచ్‌పై కూర్చోని దర్బుకా- తబలా ప్లే చేస్తూ పాడాడు.

ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయి తెగ హల్చల్ చేసింది. అక్టోబర్‌ 2020లో ఒక వ్యక్తి బిలాల్‌ సంగీతానికి పిల్లి ఆశ్వాదిస్తూ తలూపుతున్నట్లు మీమ్‌ను కూడా చేశాడు. అది పలు సోషల్‌ మీడియా వేదికలపై బాగా వైరల్ అవ్వడంతో వార్తలో నిలిచాడు. ఇలా పలు కారణాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు బిలాల్. ‌ ప్రస్తుతం ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐదురోజుల క్రితం దర్బుకా ప్లే చేస్తు కలియోన్‌ అనే సాంగ్ ని పడదు బిలాల్. అద్భుతంగా పాడిన ఆ పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో 16 లక్షల వ్యూస్‌ సాధించింది.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న బిలాల్ పాట..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts