
నేడు జగన్ సర్కార్ జగనన్న తోడు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో చితికిపోయిన వ్యాపారులకు ఎలాంటి వడ్డీ లేకుండానే రుణాలు అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. తాజాగా ఈ పథకం గురించి మాట్లాడిన టిడిపి నేత పట్టాభిరాం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మే నెలలో ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి చిరు వ్యాపారులకు పది వేల రూపాయల రుణం అందించేందుకు నిర్ణయించిందని కానీ ప్రస్తుతం జగన్ సర్కార్ సరికొత్త హంగులు అద్ది పేరు మార్చి జగనన్న తోడు అని తామే పథకం ప్రవేశ పెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అంటూ విమర్శించారు.
జగనన్న తోడు పథకం అనేకంటే జగనన్న కబ్జా పథకం అంటే ఈ పథకానికి సరైన పేరు సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు ఆయన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేరుమార్చి జగన్ తన పేరుతో పథకాలు ప్రవేశపెట్టి వాటి ప్రచారానికి ప్రజాధనాన్ని జగన్ వృధా చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు టిడిపి నేత పట్టాభిరామ్ .