
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం `వకీల్ సాబ్` చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా మరియు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ నటించనున్నాడు.
అయితే తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా ఓ డ్యాన్స్ మాస్టర్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నారు. పవన్ కల్యాణ్ తో ఓ సినిమా రూపొందించాలని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు, కథలు కూడా రెడీగా ఉన్నాయని పలు సందర్భాల్లో వెల్లడించారు.
ఆయనను డైరెక్ట్ చేయడం తన చిరకాల కోరిక అని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల జానీ, పవన్‌ని కలవడం.. స్టోరీ చెప్పేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. కథ నచ్చడంతో పవన్ ఫుల్ స్క్రిప్ట్‌తో రమ్మని పవన్ జానీకి సూచించారట. ఇక ఈ చిత్రాన్ని చరణ్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.