
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `వకీల్ సాబ్` చేస్తున్న పవన్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా రీమేక్ కూడా చేయనున్నారు.
అయితే వీరిలో వేణు శ్రీరామ్ చిత్రం చివరి దశకు వచ్చేయగా.. ఈయన మినహా మిగిలిన దర్శకులందరినీ పవన్ టెన్షన్ పెడుతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం పవన్ సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లోకూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే, పవన్ ఓ సినిమా చేస్తున్న క్రమంలో పాలిటిక్స్ వల్ల షూటింగ్ నుంచి చాలానే బ్రేకులు తీసుకుంటున్నారు.
ఇలాగైతే సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడు.. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అన్న టెన్షన్లు దర్శకుల్లో మొదలైనట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ ఆలస్యం అయితే.. విడుదల కూడా లేట్ అవుతుందని పవన్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట.