పెళ్లి చేసుకోబోతున్న పాపులర్ సింగర్..?

November 29, 2020 at 3:11 pm

మరో సెలబ్రెటీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాదిలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీలు కూడా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించాడు. ప్రముఖ సింగర్ అయిన ఆదిత్య నారాయణ్ తన ప్రియసఖిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.

డిసెంబర్ 1న తన పెళ్లి జరగబోతుంది అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కేవలం కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే తన పెళ్లి జరగబోతుంది అంటూ తెలిపాడు. తానుశ్వేత అగర్వాల్తో పన్నెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నానని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

పెళ్లి చేసుకోబోతున్న పాపులర్ సింగర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts