న‌క్కతోక తొక్కిన పూజా హెగ్డే.. ఏకంగా కండల వీరుడు సినిమాలో ఛాన్స్?

November 27, 2020 at 2:39 pm

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ చైత‌న్య హీరోగా వ‌చ్చిన `ఒక లైలా కోసం` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఆ త‌ర్వాత ముకుంద చిత్రంతో ఆక‌ట్టుకుంది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ ఇవ్వ‌క‌పోయినా.. డిజె దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత వీర రాఘవ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇక ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సూప‌ర్ హిట్ అందుకున్న పూజా హెగ్డే ప్ర‌స్తుతం తెలుగులో `రాధే శ్యామ్‌` చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్‌లో కూడా వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా త‌న అభిమాన హీరోతో నటించే ల‌క్కీ ఛాన్స్ పూజాకు వ‌చ్చిన తెలుస్తోంది.

వివ‌రంగా చెప్పాలంటే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో చెయ్యబోతున్న `కభీ ఈద్.. కభీ దివాళి` సినిమాలో పూజ హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి `హౌస్‌ఫుల్ 4` సినిమాతో గ‌త ఏడాది మంచి విజ‌యం అందుకున్న పూజా.. న‌క్క తోక తొక్కి మ‌రో అద్భు‌త‌ అవ‌కాశం అందుకుంది.

న‌క్కతోక తొక్కిన పూజా హెగ్డే.. ఏకంగా కండల వీరుడు సినిమాలో ఛాన్స్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts