నా కేరాఫ్‌ అడ్రస్‌ నాన్నే అంటున్న పూరి ఆకాష్…!?

November 30, 2020 at 3:11 pm

నాన్నే నా కేరాఫ్‌ అడ్రస్‌ అంటున్న తనయుడు. నన్ను బాల నటుడిగా తెర మీద చుసిన నాన్న , ఇప్పుడు హీరోను కూడా చేశారు. దానికి తగ్గ శిక్షణ కూడా ఆయనే ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే తన అడుగుజాడల్లోనే నడుస్తూ ఉత్తమ హీరో అనిపించుకోవాలనేది నా కోరిక అంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ తెలిపారు. ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి ఆదిత్యుని దేవాలయానికి వచ్చిన యువ హీరో మీడియాతో కాసేపు ముచ్చటించారు.

సినిమా అంటే తనకు విపరీతమయిన పిచ్చి అని, అందుకు నాన్న కూడా ప్రోత్సహించారని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రాపోరి, మెహబూబా వంటి సినిమాలో హీరోగా నటించాడు ఈ యంగ్ హీరో. తాజాగా రొమాంటిక్‌ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదిత్య స్వామి దర్శనం మొదటిసారి చేసుకున్నానని, చాలా సంతోషంగా ఉందన్నారు ఆకాష్. అనంతరం ఆదిత్యుని చిత్ర పటాన్ని ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌ వాళ్ళ కుటుంబానికి అందజేశారు.

నా కేరాఫ్‌ అడ్రస్‌ నాన్నే అంటున్న పూరి ఆకాష్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts