
పానిండియా స్టార్ ప్రభాస్ అక్కినేని వారి కోడలు సమంతను నిరాశ పరిచారని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ విషయంలో ప్రభాస్ సమంతను నిరాశ పరిచాడు అనేగా మీ సందేహం. ఆ విషయానికి వస్తున్నా.. ప్రస్తుతం సమంత ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో సామ్‌జామ్ పేరుతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నాగ్ అశ్విన్, చిరంజీవి వంటి వారిని ఇప్పటికే సమంత ఇంటర్వ్యూ చేసింది. అయితే ఆహా ఓటీటీని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు అల్లు అరవింద్ ఓ బిగ్ ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ షోలో ప్రభాస్‌తో కూడా ఒక ఎపిసోడ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సంప్రదింపులు జరపగా.. ప్రభాస్ మొహమాటం లేకుండా నో చెప్పి నిరాశ పరిచినట్టు తెలుస్తోంది.
కాగా, గతంతో ప్రదీప్ మాచిరాజు చేసిన కొంచెమ్ టచ్ లో ఉంటే చెప్తా మరియు కాఫీ విత్ కరణ్ షోలలో పాల్గొన్న ప్రభాస్.. ఎందుకు సమంతకు నో చెప్పారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల కారణంగా ప్రభాస్ కి తక్షణం తీరిక లేకుండా పోయిందని.. అందుకే నో చెప్పినట్టు తెలుస్తోంది.