భార్య‌ను ప‌రిచ‌యం చేయ‌నున్న‌ ప్ర‌భుదేవా.. ముహూర్తం ఫిక్స్‌!

November 24, 2020 at 12:12 pm

ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్ హిమనిని సెప్టెంబర్‌లోనే ప్రభుదేవా పెళ్లి చేసుకున్నాడు. ముంబయిలోని ప్రభుదేవా నివాసంలో అతడి వివాహం జరిగ‌గా.. ప్రస్తుతం వారిద్దరు చెన్నైలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఈ విష‌యాల‌ను స్వ‌యంగా ప్ర‌భుదేవా తమ్ముడు రాజు సుందరం మీడియాకు తెలిపారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుదేవా మాత్రం త‌న రెండో పెళ్లిపై స్పందించ‌లేదు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. త‌న రెండో భార్య‌ను ప‌రిచ‌యం చేసేందుకు ప్ర‌భుదేవా రెడీ అయ్యార‌ట‌. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశార‌ట‌.

ఈ రోజే త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌భుదేవా సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, 1995లో రామలత అనే మహిళను వివాహం చేసుకున్న ప్రభుదేవా, 16 ఏళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. అనంతరం హీరోయిన్ నయనతారతో ప్రేమాయ‌ణం న‌డిపించి.. పెళ్లి అనుకునే స‌మ‌యానికి విడిపోయారు.

భార్య‌ను ప‌రిచ‌యం చేయ‌నున్న‌ ప్ర‌భుదేవా.. ముహూర్తం ఫిక్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts