ప్రాణాలు తీసిన ప్రేమ.. జంట ఆత్మహత్య..?

November 21, 2020 at 5:19 pm

ప్రేమ వారి పాలిట మృత్యు శకటంగా మారిపోయింది. ప్రేమించడమే శాపంగా మారింది. చివరికి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది… జీవితంలో ఎలాగూ ఒకటిగా జీవించేందుకు అవకాశం లేదు కనీసం చావులో అయినా ఒకటిగా వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమ జంట. చివరికి నీటి గుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

బంగారు పేట మండలంలో సురేష్ రూప ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించారు. తన ప్రేమ విషయం ఇంట్లో పెద్దలు మాత్రం వీరి ప్రేమను అంగీకరించలేదు. ప్రేమించిన వారిని మర్చిపోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఈ ప్రేమజంట ఊరి చివరన ఉన్న నీటి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

ప్రాణాలు తీసిన ప్రేమ.. జంట ఆత్మహత్య..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts