
ప్రముఖ సంగీత దర్శకుడు కమలాకర్ పేరు వినగానే ప్రాణం చిత్రంలోని ..నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం అనే పాట గుర్తుకొస్తుంది. ఆ చిత్రం తీసుకొచ్చిన గుర్తింపుతో ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ పండుగ సందర్బంగా కమనీయమైన.. రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..అంటూ సాగే రెండు సువార్త పాటలు కంపోజ్ చేశారు.
ప్యాషన్ ఫర్ క్రైస్ట్ ..జోష్వాషేక్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ రెండు పాటలు మంచి ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన సంగీత దర్శకత్వంలో డివోషనల్ టచ్‌తో రెండు సాంగ్స్ కంపోజ్ చేసారని చెప్పారు. కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా అంటూ సాగే ఈ పాట ఏడు భాషల్లో రిలీజ్ అయిందంటూ చెప్పారు. ఈ పాటతో పాటు రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ అనే సాంగ్ కి కూడా జోష్వా షేక్ లిరిక్స్ అందించారని ఆయన తెలిపారు.