
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీ చంద్ మలినేని దర్శకత్వంతో `క్రాక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకం పై బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అదే ఖిలాడి.
ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరదలితో కూడా రవితేజ రొమాన్స్ చేయనున్నాడు. పవన్ మరదలు అంటే రియల్ కాదండోయ్ రీల్ లైఫ్ మరదలు ప్రణీత.
`అత్తారింటికి దారేది` చిత్రం పవన్‌కు మరదలిగా నటించిన ప్రణీత.. ఖిలాడి చిత్రంలో రవితేజతో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందని తెలుస్తోంది. కాగా, పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది.