
ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువతీ యువకుల మధ్య పుట్టిన ప్రేమ చివరికి విషాదంగా నే ముగుస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. తమ ప్రేమను పెద్దలకూ చెప్పే ధైర్యం లేక ఒకవేళ పెద్దలకు చెప్పిన ఒప్పుకుంటారో లేదో అనే భయం తో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎన్నో ప్రేమ జంటలు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో అనే భయం తో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన నిజాంబాద్ లో వెలుగులోకి వచ్చింది.
నిజాంబాద్ లోని ఆర్మూర్ లో యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఆ యువతి మేజర్ అయినప్పటికీ యువకుడు మాత్రం ఇంకా మైనర్ కావడంతో తమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారో అనే భయంతో చివరికి మనస్తాపం చెంది మామిడితోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.