దారుణం : మైనర్ బాలికపై పూజారి అత్యాచారం…!?

November 27, 2020 at 2:58 pm

గుళ్లో పూజలు నిర్వహించే పూజారి అక్కడ ఆడుకుంటున్న చిన్న బాలికపై కన్నేసి, స్వీట్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి తనని ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ కి చెందిన వెంకటరమణప్ప అక్కడ గుడిలో తాత్కాలికంగా పూజారిగా పని చేస్తున్నాడు. తన అల్లుడు బెంగుళూరులో పూజారిగా పని చేస్తున్నాడు. తన అల్లుడికి పని మీద ఊరు వెళ్ళాల్సి వచ్చి, కొద్దిరోజులు మామ వెంకటరమణప్ప ని వచ్చి తన గుళ్లో పూజారిగా కొన్ని రోజులు బాధ్యతలు నిర్వహించమని అల్లుడు కోరగా, దానికి అంగీకరించిన వెంకట రమణప్ప బెంగుళూరు వచ్చి గుళ్లో పనులు నిర్వహించటం ప్రారంభించాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుడి బయట ఆడుకుంటున్నపదేళ్ల బాలికపై వెంకటరమణప్ప కన్ను పడింది. దానితో బాలికను పిలిచి తనతో ఇంటికి వస్తే స్వీట్లు ఇస్తానంటూ ఆశ పెట్టాడు. స్వీట్స్ కి ఆశపడి పూజారి వెంట వెళ్లింది ఆ చిన్నారి. ఆడుకోటానికి వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి రాకపోవటంతో పాప తల్లితండ్రులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. తన కోసం విచారిస్తుంటే, గుడి పూజారితో కలిసి వెళ్ళిందంటూ గుడి బయట పూలు అమ్ముకునే ఓ వ్యక్తి చెప్పాడు. బాలిక తల్లితండ్రులు గుడి ప్రాంగణంలోని వెంకటరమణప్ప ఇంటికి వెళ్లి చూసేసరికి ఆ చిన్నారి భయంతో గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది.

దారుణం : మైనర్ బాలికపై పూజారి అత్యాచారం…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts