తరుణ్‌ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు: ప్రియమణి

November 22, 2020 at 3:30 pm

నువ్వే కావాలి చిత్రం ద్వారా తరుణ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపిందించుకున్నాడు. కానీ తరుణ్ కెరీర్ ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా‌ పడిపోయింది. ఆ తరువాత 2005లో నవ వసంతం సినిమాలో తరుణ్ ప్రియమణి కలిసి హీరో హీరోయిన్ గా నటించారు. ఆ టైములో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు పుకార్లు వచ్చాయి. ఆ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి చెప్పుకొచ్చారు. నవ వసంతం చిత్రం సమయంలో తరుణ్, నేను ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని చాలా వార్తలు వచ్చాయంట.

ఈ సంగతి తెలుసుకున్న తరుణ్ అమ్మ రోజా రమణి గారు షూటింగ్ స్పాట్‌కి వచ్చి నన్ను కలిసి, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా.. అదే నిజమైతే మీ పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదని అన్నారు. అసలు ఆమె అలా అడిగేవారుకూ మా ఇద్దరి గురించి అలా ప్రచారం జరుగుతోందనే నాకు తెలీదు. అసలు మేమిద్దరం కలిసి ఒక్క సినిమాలోనే నటించాం. అయినప్పటికీ మా గురించి ఇటువంటి పుకార్లు పుట్టించారంటూ ప్రియమణి చెప్పారు. ప్రస్తుతం తరుణ్ త్వరలో ఒక ఇంటివాడు అవుతున్నట్లు సమాచారం.

తరుణ్‌ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు: ప్రియమణి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts