క‌రోనాతో చిరుకి కొత్త త‌ల‌నొప్పి.. ఏం జ‌రిగిందంటే?

November 15, 2020 at 2:12 pm

టాలీవుడ్ మెగా స్టార్ చ‌రింజీవికి క‌రోనా సోకింద‌న్న వార్త ఇటీవ‌ల అభిమానుల్లో, సినీ ప్ర‌ముకుల్లో ఎంత‌టి అల‌జ‌డ రేపిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయన కరోనా నుంచి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని అభిమానులు పూజలు కూడా చేసారు. అయితే క‌రోనా సోకింద‌ని ప్ర‌క‌టించిన రెండు రోజుల‌కే చిరు.. త‌న‌కు క‌రోనా సోక‌లేద‌ని.. ఫాల్టీ ఆర్టీ పీసీఆర్‌ కిట్‌ వల్ల తనకు పొరపాటున కోవిడ్‌-19 నిర్ధారణ అయిందని చెప్పారు.

దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు క‌రోనా చిరుకి కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టింది. తాజాగా చిరంజీవికి పాజిటివ్, నెగిటివ్ అన్న విషయాలపై వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగిటివ్ అని వచ్చినప్పటికీ చిరు క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని ఆయ‌న పేర్కొన్నారు.

ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రాదని స్పష్టం చేశారు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుందని ఆయ‌న అన్నారు. అలాగే ఒకసారి కరోనా పాజిటివ్‌గా తేలి, ఆపై నెగటివ్ వచ్చినా, ఐసీఎంఆర్ ..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం, క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఎణివాస‌రావు స్ప‌ష్టం చేశారు. మ‌రి చిరు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

క‌రోనాతో చిరుకి కొత్త త‌ల‌నొప్పి.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts