పుష్కరాల్లో కరోనా కలకలం..?

November 23, 2020 at 5:33 pm

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు బయలుదేరుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా నది ప్రాంతాలలో పుష్కరాల నేపథ్యంలో ఎవరికి కూడా స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు నది ప్రాంతాలలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవలే తుంగభద్ర పుష్కరాలల్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఓ గ్రామంలో పుష్కరాల విధులు నిర్వహిస్తున్న ఎస్సై సహా నలుగురు పోలీస్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ గా రావటం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాలకు పుష్కర స్నానం కోసం వెళ్లిన ప్రజలు… సదరు పోలీసు అధికారులతో కలిసి విధులు నిర్వహించిన మరికొంత మంది పోలీసు సిబ్బంది లో కూడా ప్రస్తుతం టెన్షన్ మొదలైంది. దీంతో అధికారులు కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయిపోయారు.

పుష్కరాల్లో కరోనా కలకలం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts