రైల్వే ట్రాక్ పై కారు డ్రైవింగ్.. అధికారులు ఆశ్చర్యం..?

November 14, 2020 at 5:45 pm

ఒకసారి మందు లోపలికి వెళ్ళిన తర్వాత అది మనిషినే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అందుకే ఎంతోమంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎవరైనా కార్ రోడ్డుపైన నడుపుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా కార్ రైలు పట్టాలపై నడిపింది. అది కూడా మద్యం మత్తులో. చట్టపరంగా ఉన్న పరిమితికి మూడు రెట్లు అధికంగా మద్యం తాగిన సదరు మహిళ దాదాపు మూడు కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ పై కారు నడపడం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఓ చోట ఉన్నఫలంగా కారు టైరు పంచర్ కావడంతో ఆ కారు అక్కడికక్కడే నిలిచిపోయింది. అయితే ఇది జరిగింది భారత్ లో కాదు లెండి స్పెయిన్లో. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. స్పెయిన్కు చెందిన 25 ఏళ్ల మహిళ అతిగా మద్యం తాగి ఇలా రైలు పట్టాలపైకి కారు ఎక్కించి మూడు కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేస్తూ దూసుకుపోయింది. ఇక ఆమెను అరెస్టు చేసిన అధికారులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.

రైల్వే ట్రాక్ పై కారు డ్రైవింగ్.. అధికారులు ఆశ్చర్యం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts