సీఎం కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన రాజమౌళి..!?

November 24, 2020 at 3:03 pm

క‌రోనా వైరస్ కారణంగా అందరు తీవ్ర నష్టం చవి చూసారు. ఇలాంటి సంక్షోభంలో పడ్డ సినీరంగానికి కూడా చేయూత నందిస్తూ మన తెలంగాణ సీఎం కేసీఆర్ సోమ‌వారం నాడు ఒక తీపి కబురు నందించారు.యాజ‌మాన్యాలు నిర్ణ‌యించుకొని సినిమా థియేట‌ర్స్ ఓపెన్ చేసుకోవచ్చంటూ కెసిఆర్ పిలుపునిచ్చారు. చలనచిత్ర సీమ పై ఆధారపడుతూ అనేక మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, దేశంలో మన తెలుగు సినీరంగాన్ని మొదట నిలిపేందుకు ప్రభుత్వం ఎప్పుడు తోడ్పడుతుందని సీఎం కెసిఆర్ తెలిపారు. చిన్న చిత్రాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ మరియు సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీల రద్దు చేస్తున్న‌ట్టు కెసిఆర్ తెలిపారు.

సీఎం ఇచ్చిన ఈ తీపి క‌బురుకి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేసారు. తెలంగాణ సీఎం కెసిఆర్ సాయంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మ‌ళ్ళీ పున‌ర్వైభ‌వాన్ని పొందుతుంది అని, ధ‌న్యవాదాలు స‌ర్ అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు దర్శకుడు రాజమౌళి.ఇటువంటి కష్ట కాలంలో మీరు తీసుకున్న నిర్ణ‌యం గొప్పదని,.మీ మా హృదయ పూర్వక ధ‌న్య‌వాదాలు అంటూ పూరీ కూడా ట్వీట్ చేశారు. హీరోయిన్ ఛార్మి కూడా కెసిఆర్ నిర్ణ‌యంపై సంతోషం వ్య‌క్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపింది.

సీఎం కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన రాజమౌళి..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts