బాలీవుడ్‌ స్టార్స్‌ని వాడేస్తోన్న రాజమౌళి !!

November 26, 2020 at 5:58 pm

దర్శకుడు రాజమౌళికి స్టార్స్‌ని ఫుల్లుగా ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్‌ టాప్‌ హీరోల ఇమేజ్‌తో బిజినెస్‌ చేసుకుంటున్నాడు. ఇది వరకు బాహుబలి సినిమాకు అమితాబ్‌ బచ్చన్‌ని వాడుకున్నారు, ఇప్పుడు మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్ ని రంగంలోకి దింపనున్నాడు మన జక్కన. ఆమిర్‌ ఖాన్ కి ఉన్నస్టార్ ఇమేజ్ తో ట్రిపుల్‌ ఆర్ రేంజ్ ని మరింత పెంచాలని ఆలోచన చేస్తున్నాడు రాజమౌళి.

జూ.ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నార్త్‌ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఆమిర్‌ఖాన్‌ని రంగంలోకి దింపనున్నాడు రాజమౌళి. హిస్టారికల్ నేపథ్యంలో సాగే చిత్రం ట్రిపుల్‌ ఆర్. దీనిలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రానికి బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ ఒక ముఖ్యమయిన రోల్ ప్లే చేస్తున్నాడు. ఆలియా భట్‌ చరణ్‌కి జోడీగా నటిస్తోంది. వీళ్లతో పాటు ఆమిర్‌ ఖాన్‌ కూడా ఉంటె ట్రిపుల్‌ ఆర్ కి మరింత ప్లస్‌ అవుతుందని భావించి ఆమిర్‌తో ‘ట్రిపుల్‌ ఆర్’ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్‌కి వాయిస్‌ ఓవర్‌ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.

బాలీవుడ్‌ స్టార్స్‌ని వాడేస్తోన్న రాజమౌళి !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts