మ‌హేష్ బాబు చెల్లెలుగా మార‌బోతున్న ప‌వ‌న్ భార్య‌?

November 1, 2020 at 8:55 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రిగింది.

ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు చెల్లెలి పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నటించబోతుందని తెలుస్తోంది.

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ ఎంపిక అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్రీ లుక్‌, మోషన్ పోస్టర్ ల‌కు మంచి స్పంద‌న ల‌భించ‌డంతో పాటు సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేశాయి.

Pawan Kalyan's ex-wife Renu Desai all set for her acting comeback? - Movies  News

మ‌హేష్ బాబు చెల్లెలుగా మార‌బోతున్న ప‌వ‌న్ భార్య‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts