ప్రేమలో విఫలం అయిన వారికి రేణుదేశాయ్ సూచనలు..!?

November 27, 2020 at 3:10 pm

న‌టిగా, నిర్మాతగా,ద‌ర్శ‌కురాలిగా మంచి గుర్తింపు సాధించి ఎంద‌రో ప్రముఖుల నుండి ప్ర‌శంస‌లు కూడా అందుకున్నారు రేణూ దేశాయ్. సోష‌ల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ, నెటిజ‌న్స్‌తో త‌ర‌చు ముచ్చ‌టిస్తూ ఉంటుంది రేణూ దేశాయ్ . వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జవాబులు ఇస్తూ అప్పుడప్పుడు ప‌లు సూచ‌న‌లు కూడా చేస్తుంది. తాజాగా ప్రేమ విఫ‌లమై సూసైడ్ చేసుకోవాల‌నే ఆలోచ‌న ఉన్నవారికి తగిన సూచ‌న‌లు చేసింది రేణు.

ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా త‌న ఫాన్స్ తో ముచ్చ‌టించిన రేణూ, ప్రేమ విఫ‌లం అయితే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించిన వ్య‌క్తి మనకి దూరం అయినప్పుడు, ఇక మ‌నం మోస‌పోయాం అనిపించినప్పుడు ఆ బాధ మాటలో కూడా చెప్పలేం. కానీ బాధ త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకోవ‌డం తప్పు ఇంకా అవివేకం అని , ముందు మన జీవితం గురించి మనం ఆలోచించాలి. ఇంకా అవ‌సర‌‌మైతే కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ స‌భ్యులు, స్నేహితుల సాయంతో బాధ నుండి బయట పడచుఅంటూ రేణూ ప‌లు సూచ‌న‌లు చేసింది.

ప్రేమలో విఫలం అయిన వారికి రేణుదేశాయ్ సూచనలు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts