రేపు సాయంత్రం తో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం బంద్..?

November 28, 2020 at 3:48 pm

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఆయా డివిజన్ల లో పోటీ చేస్తున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓటర్లందరికీ ప్రసన్నం చేసుకునేది భారీ మెజారిటీతో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అయితే రేపు సాయంత్రం ఐదు గంటలతో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది అన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉన్న కొంత సమయాన్ని కూడా ఎంతో మంది అభ్యర్థులు ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు.

అయితే కొంత సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల పెద్దలు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లు అందరూ తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు . మరీ కొన్ని గంటలో గడువు ముగియనున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ప్రచార హోరు మరింత పెరిగిపోయింది.

రేపు సాయంత్రం తో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం బంద్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts