రోహిత్ శర్మ లేకున్నా.. అందరూ మంచి ఆటగాళ్లే : డేవిడ్ వార్నర్

November 23, 2020 at 5:27 pm

టీమిండియాలో కీలక ఆటగాడైన రోహిత్ శర్మను గాయం కారణంగా బిసిసిఐ పరిమిత ఓవర్ల క్రికెట్కు సెలెక్ట్ చేయలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు రోహిత్ శర్మ లేకుండానే ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఎప్పుడు ఓపెనర్గా బరిలోకి తనదైన ఆటతో జట్టు విజయంలో కీలకపాత్ర వహించే రోహిత్ శర్మ లేకపోవడం జట్టుకు తీరనిలోటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం తెలిసిందే.

అయితే భారత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ లేకపోవడంపై ఇటీవలే స్పందించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ భారత జట్టులో లేకపోవడం తీరని లోటు అని వ్యాఖ్యానించిన డేవిడ్ వార్నర్.. రోహిత్ శర్మ లేని లోటును పూడ్చేందుకు భారత జట్టులో ఎంతో ప్రతిభ కల ఆటగాళ్లు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఐపీఎల్ లో ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు అంటూ గుర్తు చేశారు డేవిడ్ వార్నర్.

రోహిత్ శర్మ లేకున్నా.. అందరూ మంచి ఆటగాళ్లే : డేవిడ్ వార్నర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts