సాహో మేకింగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..?

November 28, 2020 at 2:18 pm

బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సాహో ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులందరినీ అబ్బురపరిచింది ఈ సినిమా. టాక్ పరంగా అయితే ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది అనే చెప్పాలి. కానీ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఎంతగానో ప్రేక్షకులను మైమరిపించింది.

సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా సరికొత్త లొకేషన్లలో తెరకెక్కించారు. ముఖ్యంగా పాటలు అయితే ఎంతో అందమైన లొకేషన్లలో తెరకెక్కించారు అయితే ఇటీవలే సాహో సినిమాలో పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పాట ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రభాస్ వాయిస్ తో మొదలవుతుంది.

సాహో మేకింగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts