సమంత కొడుకు సెకెండ్ బ‌ర్త్‌డే.. ఫొటో వైర‌ల్‌!

November 24, 2020 at 11:36 am

అక్కినేని నాగచైతన్య- సమంత కొడుకు సెకెండ్ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. అదేంటి, స‌మంత‌కు ఇంకా పిల్ల‌లు పుట్ట‌లేదుగా.. కొడుకు ఎక్క‌డ నుంచి వ‌చ్చాడు? అనేగా మీ సందేహం. ఆ ముచ్చ‌ట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2017లో వివాహం చేసుకుని ఒక్క‌టైన చైతు-సామ్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌లు క‌న‌లేదు.

అయితే వీరిద్ద‌రూ యష్ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానికి సంబందించిన ఫోటోస్‌ను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. య‌ష్‌ను కుక్క‌లా కాకుండా త‌న కొడుకులా చూసుకుంటుంది స‌మంత‌. అయితే నేడు య‌ష్ సెకెండ్ బ‌ర్త్‌డే.

ఈ క్ర‌మంలోనే తాజాగా య‌ష్ అక్కినేని ఫొటోను సోష‌ల్ మీడియాలో పంచుకుంది స‌మంత‌. ప్ర‌స్తుతం స‌మంత షేర్ చేసిన ఫొటో నెటిజ‌న్లు తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, స‌మంత సినిమాల విష‌యానికి వస్తే.. ప్ర‌స్తుతం ఆహాలో `సామ్ జామ్‌` అనే ఓ టాక్ షోను నిర్వహిస్తోంది. అలాగే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

 

సమంత కొడుకు సెకెండ్ బ‌ర్త్‌డే.. ఫొటో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts