వరుణ్‌ ధావన్‌ జతగా సారా అలీఖాన్..!‌

November 28, 2020 at 5:39 pm

బాలీవుడ్ స్టైలిష్ హీరో వరుణ్ ధావన్ నటించిన కూలీ నెం 1 చిత్రం ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. అత్యంత ఫన్ తో కూడిన ఈ ట్రైలర్‌ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో హీరో వరుణ్‌ సరసన సైఫ్ అలీ ఖాన్ కూతురు హీరోయిన్ సారా అలీఖాన్‌ నటించింది. ఎప్పుడు వస్తుంది ఈ నవ్వులు పండించే సినిమా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. క్రిస్​మస్ పండుగ కానుకగా ఈ చిత్రం అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది అని తెలిపారు చిత్రం యూనిట్.

ఈ చిత్రానికి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కూలీ నెం 1 డేవిడ్‌ ధావన్‌కి 45వ చిత్రం. 1995లో రిలీజ్ అయిన కూలీ నెం 1 చిత్రాన్ని, ఇప్పుడు మరలా అదే పేరుతో రీమేక్‌ చేశారు. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వాసు భగ్నానీ ఉన్నారు. ఈ సినిమాతో అయినా వరుణ్ ధావన్ ఖాతాలో మరో హిట్ రావాలని ఆశిద్దాం.

వరుణ్‌ ధావన్‌ జతగా సారా అలీఖాన్..!‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts