ప్రేయసితో, నటుడి నిశ్చితార్థం…త్వరలోనే పెళ్లి!!

November 24, 2020 at 6:47 pm

యే రిష్తా హై ప్యార్ కే సీరియ‌ల్ ద్వారా బాగా పాపులర్ అయిన బుల్లితెర న‌టుడు హీరో షాహీర్ షైఖ్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇటీవలే తన ప్రేయ‌సి రుచికా క‌పూర్‌తో నిశ్చితార్థం కూడా జ‌రుపుకున్నాడు ఈ హీరో. ఈ గుడ్ న్యూస్ ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా త‌న అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. ప్రేయసి చేయందుకున్న పిక్ ను పోస్ట్ చేశాడు. నీతో నా జీవితం పంచుకునేందుకు చాలా ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను అంటూ రాసారు.

షాహీరో పోస్ట్ చేసిన ఈ పిక్ లో తన ప్రేయసి రుచికా ఎడ‌మ చేతి వేలికి ఎంగేజ్‌మెంట్ ఉంగరం తొడిగి ఉండగా, నచ్చిన ‌వాడితో జీవితం పంచుకోబోతున్నందుకు ఆనందంలో విహరిస్తునట్లు రుచిక క‌నిపిస్తోంది. పెళ్లితో ఒక్కటవనున్న ఇద్దరికీ వారి అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ ప్రేమ జంట‌ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో బంధువుల స‌మ‌క్షంలో ఘ‌నంగా పెళ్లి చేసుకోనున్నారు

ప్రేయసితో, నటుడి నిశ్చితార్థం…త్వరలోనే పెళ్లి!!
0 votes, 0.00 avg. rating (0% score)