మృతదేహం పై కుక్క దాడి.. ఎక్కడో తెలుసా…!?

November 27, 2020 at 3:48 pm

ఓ శునకం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న శవాన్ని తినేందుకు ప్రయత్నించిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో సంభాల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం నాడు చోటు చేసుకున్న ఈ సంఘటనపై అక్కడి ప్రజలు తీవ్ర కోపం చూపుతున్నారు.రోడ్డు ప్రమాదానికి గురైన ఓ చిన్నారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు, కాని ఆ బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న ఆ శవాన్ని హాస్పిటల్ లో ఓ మూల స్ట్రెచర్‌పై ఉంచారు.

హఠాత్తుగా దానిని ఓ వీధికుక్క పీక్కు తినడానికి ప్రయత్నించినా ఓ వీడియో ఇప్పుడు సోషల్సం మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 20 సెకన్ల సాగే ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ చిన్నారి కుటుంబానికి సంతాపం తెలియచేస్తూ, ఈ సంఘటనకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వారు కోరారు.

మృతదేహం పై కుక్క దాడి.. ఎక్కడో తెలుసా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts