ప‌వ‌న్ రీ ఎంట్రీపై శృతి హాస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

November 26, 2020 at 8:23 am

దాదాపు రెండేళ్ల త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `వ‌కీల్‌ సాబ్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం వ‌స్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అంజలి, అనన్య పాండే, నివేదా థామస్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అయితే ఇప్పటివరకు షూటింగ్‌కు హాజరు కాలేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చ‌టించిన‌ శ్రుతి.. `వకీల్ సాబ్` గురించి మ‌రియు ప‌వ‌న్ రీ ఎంట్రీ గురించి మాట్లాడింది.

శ్రుతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తోందని, ఆ సినిమాలో తానూ భాగమవుతుండటం అంతకు రెట్టింపు సంతోషాన్నిస్తోందని చెప్పింది. అలాగే జనవరి నుంచి `వకీల్ సాబ్` షూటింగ్‌కి హాజరు కాబోతున్నానని తెలిపింది. పవన్‌తో మూడోసారి పనిచేస్తునందుకు చాలా సంతోషంగా ఉంద‌ని ఆమె తెలిపింది.

ప‌వ‌న్ రీ ఎంట్రీపై శృతి హాస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts