
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సింగర్‌గానే కాకుండా యాంకర్, హోస్ట్, సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఇప్పటి వరకు వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఈమె వ్యక్తగత జీవితం విషయానికి వస్తే.. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తితో సునీతకు పెళ్లయ్యింది.
ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె విడాకులు తీసుకుని చాలా కాలంగా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే తాజాగా సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ సునీత ఖండించింది.
ఇప్పుడు మరోసారి సునీత రెండో పెళ్లి వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సదరు వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లే అని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. సునీత స్పందించాల్సిందే.