సోనియా వల్లే బిజెపిలోకి వెళ్తున్న అంటున్న సర్వే సత్యనారాయణ..?

November 21, 2020 at 5:46 pm

కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉన్న నాయకత్వం కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అంటూ విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి నియమించింది కెసిఆర్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కష్టంగా మారిందని విమర్శించారు.

ఈ సందర్భంగా తాను బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాను అన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు బిజెపి అంటూ వ్యాఖ్యానించి సర్వే సత్యనారాయణ సోనియా ఆశీర్వాదం తోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం మాజీ మంత్రి కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

సోనియా వల్లే బిజెపిలోకి వెళ్తున్న అంటున్న సర్వే సత్యనారాయణ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts