
రీల్ లైఫ్‌లో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ రియల్ లైఫ్ మాత్రం ప్రజల చేత హీరో అనిపించుకున్నాడు. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. రైతులకు అండగా నిలుస్తున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే సమాజ సేవకుడిగా మారిపోయాడు సోనూసూద్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ అభిమానంతో సోనూసూద్ తాజాగా ఓ ఘన సాధించారు. ట్విటర్ ఫాలోయింగ్‌లో సోనూసూద్ బాలీవుడ్ సూపర్స్టార్లను
దాటేసి ఏకంగా టాప్-5 జాబితాలో చేరిపోయారు.
దేశవ్యాప్తంగా ట్విటర్లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన వ్యక్తుల జాబితాలో సూనూ సూద్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ ఉన్నాయి. ప్రస్తుతం మోదీకి చేరువలో ఉన్న సోనూ.. తన సేవాకార్య క్రమాలను ఇలానే కొనసాగిస్తే ఖచ్చితంగా అగ్ర స్థానానికి చేరిపోతాడని అభిమానులు అంటున్నారు.