
అక్కినేని వారి కోడలు సమంత ఇటీవల భర్త నాగ చైతన్యతో కాలిసి విహార యాత్రం కోసం మాల్దీవులు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనాతో కొన్నాళ్లుగా ఇంట్లోనే బందీలైన సమంత.. అక్కడికి వెళ్లగానే ఫ్రీ బర్డ్స్‌లా విహరిస్తోంది. అంతేకాదు, అక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటోంది.
ఈ క్రమంలోనే ఇటీవల బాత్‌టబ్‌లో బికినీ వేసుకొని జలకాలాడుతున్న ఫొటోను అందరితో పంచుకుంది సామంత. ఆ ఫొటో తెగ వైరల్ అయింది కూడా. అయితే తాజాగా సమంత పోస్ట్ చేసిన బాత్‌టబ్ ఫొటోను వివాస్పద నటి శ్రీరెడ్డి షేర్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సోషల్ మీడియాలో బూతులతో వీరంగం సృష్టించే శ్రీ రెడ్డికి తాజాగా `గాయ్స్.. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా చూడండి. సమంతకు పెళ్లయింది.. ఆమెకు 100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. అయినా కూడా తన అందాలను ఆరబోస్తూ ఇలా ఎందుకు వ్యాపారం చేస్తుందో!` అంటూ సమంతపై హాట్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం శ్రీరెడ్డి పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.