అతని కామెంట్స్ తో హార్ట్ అయిన విష్ణు ప్రియ..!?

November 29, 2020 at 6:08 pm

తెలుగులో ఫీమేల్ యాంకర్స్ కు లోటు లేదు. సుమ, అనసూయ, రష్మి గౌతమ్ లాంటి ప్రముఖ యాంకర్స్ ను పక్కనబెడితే ఆ తర్వాత కోవలో వర్షిణి, వర్ష, విష్ణుప్రియ లాంటి యాంకర్స్ తమ సత్తా చాటడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.విష్ణు ప్రియకి సుడిగాలి సుధీర్‌తో చేస్తున్న పోవే పోరా షో మంచి గుర్తింపు తెచ్చింది. విష్ణు తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈమె చెక్ మేట్ అనే మూవీలో నటించింది.

ఇదివరకు ఎప్పుడో పూర్తైన ఈ సినిమా ఇప్పుడు విడుదలవుతుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన సుడిగాలి సుధీర్ చాలా హర్ట్ అయ్యాడని తెలిపింది విష్ణుప్రియ.ఇందుకు కారణం విష్ణు కొన్ని సన్నివేశాలలో బికినిలో కనిపించనుంది. దీని సుధీర్ కొంచెం పర్సనల్ గా తీసుకున్నాడని, కానీ సుధీర్ మూవీ విడుదలైనపుడు మనస్పూర్తిగా బాగుందని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ఈ అందాల భామ. ఏది ఏమైనా పోవే పోరా షోతో ఈ ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఆ సానిహిత్యంతోనే ఇద్దరూ ఒకరినొకరు అనుకుంటుంటారు కూడా అని అంటున్నారు నెటిజన్లు.

అతని కామెంట్స్ తో హార్ట్ అయిన విష్ణు ప్రియ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts