స్కూబా డైవింగ్ ఫోటోలు షేర్ చేసిన కాజల్..?

November 16, 2020 at 1:18 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్గా కొనసాగి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే అక్టోబర్ 30వ తేదీన తన ప్రియ సఖుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే మాల్దీవులకు వెళ్లి అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. అభిమానులను మాత్రం మర్చిపోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు వినూత్న మైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులందరికీ అలరిస్తూనే ఉంది. ఇటీవలే అండర్ వాటర్ లో ఏర్పాటు చేసిన ఒక బెడ్ పై భర్త గౌతమితో కలిసి ఫోజులు ఇచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఏకంగా స్కూబా డైవింగ్ చేస్తూ నెటిజన్లు అందరినీ ఆకర్షిస్తుంది కాజల్ అగర్వాల్. ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్కూబా డైవింగ్ కు సంబంధించిన ఫోటోలను చేయగా ఇవి నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. ఇక ప్రస్తుతం త్వరలో ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. దొరికిన కాస్త సమయాన్ని భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్.

స్కూబా డైవింగ్ ఫోటోలు షేర్ చేసిన కాజల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts