‘పుష్ప’కు మరో హీరో కావాల‌ట‌.. వెతుకులాట‌లో సుకుమార్‌?

November 23, 2020 at 5:30 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ కాంబో రాబోతోన్న చిత్రం `పుష్ప‌`. ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రధాన తారాగణం మొత్తం ఇందులో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం తమిళ హీరో వైవిధ్యమైన నటుడు అయిన విజయ్ సేతుపతి ని తీసుకున్నారు చిత్రబంధం.

కానీ షూటింగ్ ప్రారంభానికి ముందే విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. డేట్లు సర్దుబాటు కాకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ పాత్రకు గానూ విజయ్ సేతుపతి లాంటి మరో హీరో కోసం సుకుమార్‌ వెతుకులాట మొదలుపెట్టార‌ట‌. మ‌రి విజయ్ సేతుపతి లాంటి హీరో.. పైగా తమిళం లాంటి భాషలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో పుష్ప‌కు దొరుకుతాడో లేదో చూడాలి.

కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తు్న్నారు. ప్ర‌స్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

‘పుష్ప’కు మరో హీరో కావాల‌ట‌.. వెతుకులాట‌లో సుకుమార్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts