మంత్రి కే టి ఆర్ పై సుమ ప్రశంసలు..!

November 21, 2020 at 3:01 pm

బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో అందరికి వినోదాన్ని పంచుతూ అలరిస్తుంటారు యాంకర్ సుమ కనకాల. యాంకరింగ్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్నిఅందిస్తూ స్టార్‌ యాంకర్‌గా పేరు సంపాదించారు సుమ. అటు సినిమాలు, టీవీ షోలు, ఆడియో రిలీజ్ ‌ఫంక్షన్లు ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. లేటెస్టుగా సుమక్క పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా స్టార్ట్ చేసారు. తన మాటల గారడితో అందరి హృదయాలను దోచుకుంటూ ఇక్కడ కూడా తన సత్తా చాటారు. రీసెంట్ గా తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వచ్చారు సుమ కనకాల.

దీనికి సంబందించి కేటీఆర్‌తో మాట్లాడ్తున్నప్పుడు పిక్ ని ట్విటర్‌లో ఫోటోను పోస్ట్ ‌చేశారు సుమ. మీతో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నేను నా షోలో నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూ ఉంటాను. కానీ మీలా నాయకత్వ హోదాలో మాట్లాడే తీరు వినడానికి ఎంతో విలువైనది అని, మీరు మాట్లాడే విధానం ఇంకా నిబద్దత చాలా అద్భుతం అంటూ కేటీఆర్‌ను తన పొగడ్తాలతో ముంచెత్తారు యాంకర్ సుమ. సుమ పోస్ట్ చేసిన ఫోటో పై నెటిజన్లు మాత్రం భిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొంత మంది అయితే ఎన్నికల ప్రచారం కోసమే కలిశారంటూ కామెంట్ల పెడుతున్నారు.

మంత్రి కే టి ఆర్ పై సుమ ప్రశంసలు..!
0 votes, 0.00 avg. rating (0% score)