బ‌న్నీ `పుష్ప‌`లో విల‌న్‌గా స్టార్ క‌మెడియ‌న్‌!

November 27, 2020 at 7:48 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌- క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మూడో చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.

లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాలో విల‌న్ ఎవ‌ర‌నేది తెలియ‌లేదు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో స్టార్ క‌మెడియ‌న్ సునీల్ న‌టించ‌నున్నాడ‌ట‌. అది కూడా నెగెటివ్ పాత్రలో చేయనున్నారట.

ఇప్ప‌టికే సునీల్ డిస్కో రాజా, క‌ల‌ర్ ఫొటో వంటి చిత్రాల్లో విల‌న్ న‌టించి.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఈ క్ర‌మంలోనే పుష్ప‌లో కూడా ఓ నెగ‌టివ్ రోల్‌లో సునీల్ న‌టించ‌నున్నాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది.

బ‌న్నీ `పుష్ప‌`లో విల‌న్‌గా స్టార్ క‌మెడియ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts