ప్రభాస్ తమ్ముడిగా ఎవరు నటిస్తున్నారంటే…!?

November 28, 2020 at 3:31 pm

టాలీవుడ్ రెబల్‌స్టార్‌ హీరో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆదిపురుష్‌. ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ ప్రముఖ ‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రను ఏ హీరో పోషించనున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని చెప్తున్నారు చిత్రం దర్శకుడు. దీనితో సోషల్‌మీడియా లో ఆదిపురుష్‌ సినిమా సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ సీత పాత్రను పోషించనున్నారంటూ మొన్న వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటె ఇప్పుడు మరో బాలీవుడ్‌ నటుడు ఆదిపురుష్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సోను కి టీటూ కీ స్వీటీ సినిమాలో తన నటన ప్రతిభను చూపించిన సన్నీ సింగ్‌ ఈసినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు మీడియా వర్గాల టాక్. ఈ విషయమై ఇప్పటికే ఆదిపురుష్ టీమ్‌ సన్నీ సింగ్‌తో మాటలు జరిపినట్లు బాలీవుడ్‌లో టాక్‌ కూడా వినిపిస్తోంది. దీనిపై ఎటువంటి ప్రకటన లేన్నప్పటికీ సన్నీసింగ్‌ ఫొటోలు సోషల్చ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ తమ్ముడిగా ఎవరు నటిస్తున్నారంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts