
హీరోయిన్ తాప్సీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఝుమ్మంది నాదం` చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ అమ్మడు.. టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే బాలీవుడ్లో మాతం మంచి పర్ఫామర్‌గా ప్రశంసలు అందుకుంటోంది. అక్కడ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. తన తన నటనతో మిలియన్ ప్రజల ప్రేమాభిమానాలు పొందింది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తాప్సీ తన సినిమాల విషయాలతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం తాప్సీ ‘రష్మీ రాకెట్’ అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్ గా కనిపించనుండగా.. అందుకోసం కసరత్తులు చేస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల జిమ్ చేస్తున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే వాటిపై తాజాగా ఓ నెటిజన్ సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ హీరోయిన్గా రాణిస్తున్నావు తప్ప నీలో అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఫాల్తు హీరోయిన్’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో తాప్సీ షాకింగ్ రిప్తై ఇచ్చింది. సదరు నెటిజన్ కామెంట్‌పై తప్సీ స్పందిస్తూ.. ` చూపించడం అంటే ఏంటి ..? నీకు నా టాలెంట్ చూపించాను. కానీ నీకు అది కనిపించదు..’ అంటూ బుద్ది చెప్పింది.