పొలాల్లోకి దూసుకెళ్ళిన తమ్మినేని కారు.. తృటిలో తప్పిన ముప్పు!

November 21, 2020 at 3:14 pm

ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్ర‌యాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద తమ్మినేని కారుపైకి ఓ ఆటో వేగంగా దూసుకొచ్చింది. ఆటోను తప్పించబోయిన స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్ళింది.

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో త‌మ్మినేనికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాల‌వ‌డంతో పాటు ఆటో కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో గాయపడిన వారిని దగ్గరుండి మ‌రీ త‌మ్మినేని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలింపజేశారు.

అనంత‌రం ప్రత్యామ్నాయ వాహనంలో స్పీకర్ తమ్మినేని తన ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణమైన స్పీకర్ కారుకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పొలాల్లోకి దూసుకెళ్ళిన తమ్మినేని కారు.. తృటిలో తప్పిన ముప్పు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts