తాము గెలిస్తే.. పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ : బండి సంజయ్

November 24, 2020 at 3:04 pm

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా బండి సంజయ్ కనిపిస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఎప్పుడూ సంచలన విమర్శలు చేస్తూ.. మీడియాలో ఎక్కడ చూసిన ఆయనే దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లోకి తీసుకు వెళుతూ.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇటీవలే హబ్సిగూడ లో ప్రచారం నిర్వహించారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. ఏకంగా పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేసి రోహింగ్యాలను పాకిస్థానీ లను తరిమి కొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. రోహింగ్యాలు లేని ఎన్నికలు జరగాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది జరగడం కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని బిజెపికి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలి అని సూచించారు.

తాము గెలిస్తే.. పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ : బండి సంజయ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts