ఆచార్య సెట్స్లోసోనూసూద్‌ను సత్కరించిన తనికెళ్ల భరణి!!

November 21, 2020 at 6:56 pm

దర్శకుడు కొరటాల శివ,మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కరోనా కారణం చేత ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభమైంది. దీనితో యాక్టర్ సోనూసూద్‌ ఆచార్య చిత్ర షూటింగ్‌ సెట్స్లో అడుగు పెట్టిన సందర్భంగా , కరోనా లాక్‌డౌన్‌ సమయంలో యాక్టర్ సోనూసూద్‌ అందించిన సేవలను పొగుడుతూ సినీ రచయిత ఇంకా నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, మూవీ యూనిట్‌ అందరు కలిసి ఆచార్య సెట్‌లో సోను సూద్ ని సత్కరించారు.

ఆయనకు శాలువ కప్పి, మెమొంటో కూడా అందజేశారు. నిర్మాత బీఏ రాజు ఈ ఫోటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు. ​ లాక్‌డౌన టైములో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అందించిన సేవలు అమోఘం అని చెప్పుకొచ్చారు. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకుని రియల్‌ హీరోగా నిలిచారు.

ఆచార్య సెట్స్లోసోనూసూద్‌ను సత్కరించిన తనికెళ్ల భరణి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts