టీమ్ ఇండియా ఆసీస్ పర్యటన.. అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి..!

November 24, 2020 at 6:03 pm

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో చేరేందుకు రోహిత్ శర్మ ఇశాంత్ శర్మ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే. గాయం బారిన పడిన ఇద్దరు ఆటగాళ్లు నిపుణుల పర్యవేక్షణలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల బిసిసీఐ అధికారులు వీరి ఫిట్నెస్ పై సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది

ఈ సమీక్షలో బిసిసిఐ వర్గాలు ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఫలితాలు సంతృప్తికరంగా లేవు అని భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్ళు కోలుకోవడానికి మరికొన్ని వారాలు సమయం పట్టే అవకాశం ఉందని బిసిసీఐ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది ఏం జరుగుతుందో చూడాలి మరి.

టీమ్ ఇండియా ఆసీస్ పర్యటన.. అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts